నాన్న ఈ రోజు Father’s Day. Happy Father’s Day. You are my everythg అని రాద్దామని అనుకున్నా కానీ మనసు రాలేదు. ఆ రెండు ముక్కల్లో రాసేస్తే మనసులో దాగున్న ఈ బాధ చెప్పుకో లేనో ఏమో అనిపించింది.
నీకొక నిజం చెప్పనా నాన్నా? సరిగా సీరియస్ గా కూర్చొని ఆలోచిస్తే తప్పితే నువ్వు మా దగ్గర లేవన్న విషయం తెలియటం లేదు. ఎంత సేపూ నువ్వు నాతో నే ఉన్నట్లుగా ఉంది నాన్నా.
ఒక్కోసారి భలే ఆశ్చర్యం. దేవుడి ముందు నేను చెప్పుకొనే ఊసులు నీకు ఎలా తెలుస్తున్నాయి అని. ఎన్నో సందర్భాలు . అవును కదా నాన్నా. నా తోనే నువ్వు ఉన్నావు నా ప్రత్యక్ష దైవం గా ఎప్పటికీ
నా ప్రతి మాటల్లో గడియ గడియ కి నీ తోనే చెపుతున్నట్లు ఉంది, నేను వేసే ప్రతి అడుగులో నువ్వే కనిపిస్తున్నావు. నన్ను ఒక అమ్మాయి అని కాకుండా ఒక అబ్బాయి కన్నా ఎక్కువగానే పెంచావు.ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకురా అని అన్నా కూడా నువ్వేమి పట్టించుకోలేదు. ప్రతి రోజు నీకు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టుకొని అమ్మాయికి అవి నేర్పించాలి ఇవి నేర్పించాలి అని ఎప్పుడూ తాపత్రయ పడేవాడివి.
నాకు ఇంకా గుర్తుంది నాన్నా. మామూలు roads మీద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కి తీసుకువెళ్లి మరీ నాకు దగ్గర ఉండి సైకిల్ నేర్పించావు. అప్పుడు ఇలాంటి మూడు పెడల్స్ వి లేవు కదా. ఒక వేళ ఉన్నా కూడా నువ్వు అంతేలే. వదిలి పెట్టేవాడివి కాదు.న్యూస్ పేపర్స్ లో ఈ మాత్రం ఉపయోగ పడే ఆర్టికల్స్ వచ్చినా అవి నా కోసం చక్కగా కట్ చేసి దాచి పెట్టె వాడివి. ఇప్పటికీ ఆ ట్రంక్
పెట్టె లో అలానే ఉన్నాయి. ఆర్టికల్స్ ఏంటి ఇంకా ఎన్నో రకాల పెన్నులు నా కోసంతెచ్చేవాడివి. ఎందుకు నాన్న అంటే అవన్నీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాదేవి అనే వాడివి.
సైకిల్ మీద కూర్చో పెట్టుకొని post office లు, బ్యాంకు లు చూయించేవాడివి. ఏమి అవసరం లేకపోయినా కేవలం నా కోసమే. నేను తెలుసుకోవడానికే అన్నట్లు చూయించేవాడివి. నువ్వు కూడా ఆలా పెద్దయ్యాక సంతోషం గా ఉండాలి AC రూమ్ లో కుర్చీని ఉద్యోగం చేసుకోవాలి అనే వాడివి.
పువ్వుల్లో పెట్టుకొని పెంచావు ఒక ప్రిన్సెస్ లా గా. ఒక రాజ్యం యువరాణి కైనా ఏమైనా తగ్గొచ్చేమో కానీ నాకు మాత్రం ఏ లోటూ లేకుండా పెంచావు.పిచ్చి నాన్నా. నీకు గుర్తుందా. నా ఇంటర్మీడియట్ ఫైనల్ Exam లో ఒక కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది అని వార్తలు వచ్చాయి. అంతే ఆ రోజంతా బజారు లోనే ఉన్నావు. ఇంటికి రాకుండా. ఏమో పేపర్ వస్తే అందరికి తెలిసి మన అమ్మాయికి తెలియకపోతే ఎలా అందరికి మంచి మార్కులు వచ్చి మన అమ్మాయికి తక్కువ వస్తే ఎలా అని రాత్రి అంతా నిద్ర లేకుండా రోడ్ మీదనే ఉన్నావు. ఆఖరికి పేపర్ తోనే ఇంటికి వచ్చావు. పిచ్చి నాన్నా! నేను నీ కూతురు ని నాన్నా. పేపర్ చూసినా చూడక పోయినా నీ కూతురికి ఫుల్ మార్కులే ఎప్పుడూ.
నువ్వు చదువుకో లేక పోయావు. ఆ చదువు విలువ మాకు ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉండేవాడివి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా మాకు ఏ మాత్రము అవకాశాలు తక్కువ చేయలేదు.నేను ఇంజనీర్ ఆ డాక్టర్ ఆ లేక CA నా అని ఏమి చేయాలో అర్ధం కానప్పుడు నన్ను ఎంత మంది దగ్గరికి తీసుకు వెళ్లవు నాన్నా. మన ఊర్లో మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర అందరికి తీకువెల్లావు. కేవలం నేను అర్ధం చేసుకొని నిర్ణయం తీసుకోవాలని. అసలు నీకు చదువు రాకపోయినా ఇలాంటివి అన్నీ నాకు ఎలా చేసావు నాన్న.
నేను ఇప్పుడు ఇలాంటివి ఏవైనా చెయ్యగలిగానా? నాకైతే డౌట్ ఏఏ రోజూ నువ్వు మంచి బట్టలు కానీ చెప్పులు కానీ కొనుక్కోవటం నేను చూడలేదు. పొలం పనికి నాకు ఎందుకమ్మా ఒక బన్నీ అను లుంగీ ఉంటే సరిపోదా? మీరు పట్నం వెళ్ళాలి చదువుకి అని మంచి మంచి తాన్లు పట్టించే వాడివి మాకైతే.
ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే నా కంటి నీరుని ఆపాలన్న ప్రయత్నం విఫలమే అవుతుంది నాన్నా……మళ్ళీ చూడాలని ఉంది నాన్న……జాగ్రత్త నాన్నా. శివయ్య దగ్గ్గర నువ్వు సంతోషం గా మమ్మలిని చూస్తూ ఉన్నావని ఆశిస్తున్నాను. ఒక సారి వస్తే నీకు ఇక్కడ అంతా చూయించాలని, దగ్గరే ఉండి అంతా వండి పెట్టాలని ఆశగా ఉంది నాన్న.శివయ్య ని అడిగి ఒకసారి వచ్చేయి నాన్నా. అమ్మ నీ కోసం వేయి కన్నులతో ఎదురు చేస్తుంది.
ప్రేమతో
నీ ముద్దుల తల్లి