కవితలు (చేనేత అన్న)
నేతన్న నేతన్న ఓయన్న – నీకు వేల వేల దండాలు మాయన్న
రేయనక పగలనక ఓయన్న- నువ్వు నేసిన బట్టలు మాయన్న
మానవాళికి నేడు ఓయన్న- అభిమానానికి ప్రతి రూపం నీవన్న
నువ్వు నేసిన బట్టలు – ఇంపుసొంపుగుండె
చిన్ననక పెద్దనక – పరవశించి పోతుండ్రు

పోగు పోగు కలిపినావు- పట్టుబట్టలు నేసినావు
అంగరంగా వైభవంగా – రంగులెన్నో అద్దినావు
జాతీయ జెండాను నేసి – జాతికే వన్నెను తెచ్చి

రేయనక పగలనక ఓయన్న – నువ్వు నేసిన బట్టలు మాయన్న
మానవాళికి నేడు ఓయన్న- అభిమానానికి ప్రతి రూపం నీవన్న
పట్టుబట్టలు నేస్తున్నావు – పట్టెడన్నము కోసం నేడు
ప్రతిఫలం లేక నీవు – పస్తులున్న రోజులు ఎన్నో
పారేశాను కాకోయన్న – ప్రతినబూని చెబుతున్నాము
మనం తెలుగు వాళ్లంతా – మీకండగుంటాము
సింగపూర్ లోనా మహిళలు- పట్టుబట్టి చెబుతున్నారు
పాలిస్టర్ బట్టలు వద్దు – నేత బట్టలు వేస్తామన్న
నేతన్న నేతన్న ఓయన్న – నీకు వేల వేల దండాలు మాయన్న
రేయనక పగలనక ఓయన్న- నువ్వు నేసిన బట్టలు మాయన్న
మానవాళికి నేడు ఓయన్న- అభిమానానికి ప్రతి రూపం నీవన్న
~కట్ట రాజిరెడ్డి, సింగపూర్