పండుగొచ్చే పండుగొచ్చే ఎన్నీయల్లో ఎన్నీయల్లో-
మన తెలుగువారి పండుగొచ్చే ఎన్నీయల్లో
చైత్రమాసంలో వచ్చేపండుగ ఎన్నీయల్లో ఎన్నీయల్లో-
ఉవ్విళ్ళూరించే ఉగాది పండుగ తెలుగువాళ్ళలో (2 )

తీపి చేదుల కలయిక ఎన్నీయల్లో-
సుఖ దుక్ఖాలకు సంకేతం ఎన్నీయల్లో
కారం వగరుల కలయిక ఎన్నీయల్లో-
సవాళ్లు సహనానికి సంకేతం ఎన్నీయల్లో
పులుపు ఉప్పుల కలయిక ఎన్నీయల్లో- రుచికి,సుచికి సంకేతం ఎన్నీయల్లో
షడ్రుచుల సమ్మేళనం ఎన్నీయల్లో ఎన్నీయల్లో- జీవితానికి పరమార్ధం జీవితంలో
పండుగొచ్చే పండుగొచ్చే ఎన్నీయల్లో ఎన్నీయల్లో- మన తెలుగువారి ప్రధమ పండుగ ఎన్నీయల్లో
చైత్రమాసంలో వచ్చేపండుగ ఎన్నీయల్లో ఎన్నీయల్లో –
ఉవ్విళ్ళూరించే ఉగాది పండుగ తెలుగువాళ్ళలో
ఉగాది ఉత్సాహాన్ని తెస్తుంది ఎన్నీయల్లో– ఊరంతా ఉరుకలు వేస్తుంది ఎన్నీయల్లో (2 )
వసంత ఋతువు ఆరంభం ఎన్నీయల్లో ఎన్నీయల్లో– మన క్రొత్త జీవితానికి సంరంభం తెలుగువాళ్లలో
పండుగొచ్చే పండుగొచ్చే ఎన్నీయల్లో ఎన్నీయల్లో- మన తెలుగువారి ప్రధమ పండుగ ఎన్నీయల్లో
చైత్రమాసంలో వచ్చేపండుగ ఎన్నీయల్లో ఎన్నీయల్లో –
ఉవ్విళ్ళూరించే ఉగాది పండుగ సింగపూర్ లో
~కట్ట రాజిరెడ్డి, సింగపూర్