హలో ఫ్రండ్స్…
తెలుగు భాష దినోత్సవం సందర్భం గా చిన్న కథ రాసాను.. పూర్తిగా చదవండి pls.. అలాగే ఎలా ఉందో తెలుపగలరు… 😊
శనివారం wwekend అవటం వలన కొంచెం లేట్ గా లేచాను. ఈ రోజులలో అలవాటు ప్రకారం లేస్తూనే ఫోన్ చూసాను వాట్సాప్ మెసేజ్ .. నా చిన్నప్పటి ఫ్రండ్. స్కూల్ డేస్ ఫ్రండ్. ఈ సంవత్సరం ఊరికి వస్తావా అని ఉంది. ఎప్పుడు యాక్టీవ్ గా రీప్లే ఇచ్చే నేను ఈ సారి ఇవ్వలేక పోయాను. అన్నట్టు మీకు చెప్పనేలేదు కదా.. తను నాకు ఓసంవత్సరం క్రితం ముఖపుస్తమ్ ద్వారా పరిచయం అయ్యింది. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటాం చిన్నప్పటి విషయాలు. అప్పుడెప్పుడో వదిలేసిన స్నేహం మళ్ళీ సామాజిక మాధ్యమం ద్వారా కలిసాము.
తన మెసేజ్ చూసేసరికి ఒక్కసారి మనసంతా.. అదోలా అయిపోయింది. ఎమ్ చెప్పాలో అర్ధం కాలేదు.. ఒకవైపు వెళ్లాలని ఉన్నా పరిస్థితులు ఆ అవకాశం ఇవ్వటం లేదు. మా అమ్మా వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఊరిలో లేరు. అయినా ఎదో ఒక రోజు వెళ్తాను ఊరికి అనే ఆశ. మొహం కడ్డుకుని అలవాటు ప్రకారం కాఫీ కప్ తో సోఫా లో కూర్చున్నా.. నాకు తెలీకుండా నేను మానసికంగా గాలి కంటే వేగంగా ఊరికి వెళ్ళిపోయాను.
ముందు పల్లెవెలుగు బస్సు.. చూడగానే ఏవో గ్యాపకాలు .. ఆ బస్సు రోడ్ మీద బస్టాప్ లో ఆగింది. అక్కడనుంచి కొంచెం ముందుకు వెళ్లే సరికి నేను రోజు కొనుక్కునే ఆశా ఇంకా కుక్కీస్ చాకోలెట్స్ షాప్ క నిపించింది. కొంచెం ముందుకు వెళ్ళాను ప్రతీ సోమవారం తీర్థం ప్రసాదం కోసం పరుగులు తీసే శివాలయం. అక్కడికి దగ్గరే మా ఇల్లు. ఒక్కసారి చూసేసరికి కళ్ళు చెమర్చాయి.పచ్చటి పంట పొలాలు. పారే సెలయేరులు కొండలు ప్రతీ మంగళవారం అయ్యే సంతలు స్నేహితులతో కలిసి వెళ్లిన గ్యాపకాలు.. సంక్రాంతి పండగ రోజులలో మాఊరు పసుపు రాసిన గడపలు ఇళ్ల నిండా ధాన్య రాసులు. ప్రతీ ఇంటికి సున్నాలు. వాకిళ్ళలో రంగు రంగు ల ముగ్గులు. పచ్చటి తోరణాలతో… కొత్త పెళ్లి కూతురి లా ముస్తాబైయ్యేది. పండగ రోజులలో స్కూల్ 10 రోజులు సెలవులు. ఇంక చూడండి తెల్ల వారు ఝామున వచ్చే బుడబుక్కల వాళ్ళు. తెల్లరాక వచ్చే హరిదాసులు , గంగిరెడ్లు, కోడి పందేలు, పిల్లలంతా జల్దీ 5 ఆటలు.. ఊరంతా సందడే సందడి. వేసవి సెలవులు లలో.. సంవత్సరానికి సరిపడే పప్పులు ఉప్పులూ కొని అమ్మావాళ్లు ఎండలో పెట్తాటం.. చింత పండు కొని విఇదంతా కలిసి గింజలు తియ్యటం. వేసవి ముగిసాక స్కూల్స్ స్టార్ట్ అయ్యేవి.. కొత్త బుక్స్ అట్టలు వెయ్యటం.. ఏమున్నాయో పాఠ్యఅంశాలు ముందుగానే చూసుకోటం. స్నేహితులు.. సరదాలు.. తరువాత గణపతి నవరాత్రులు.. ప్రతీ రోజు అక్కడికి వెళ్లి ప్రసాదాలు తీసుకోవటం.. రోజు రాత్రులు ఎదో ఒక ప్రోగ్రాం ఉండేది.. దానికి కూడా వీలైతే ఫ్రండ్స్ ఇంకా కుటుంబాలతో సహా వెళ్ళటం.. అదయ్యాక దసరా ఇంక చెప్పాలా.. కొత్త బట్టలు.. వాహన పూజలు.. 2, 3km నడిచి అమ్మవారి గుడికి వెళ్ళటం.. కొత్తగా సినిమా రీలీస్ అయితే మధ్యాహ్నం ఆట కి ఫ్రండ్స్ తో వెళ్ళటం.. ఒకటేమిటి… దీపావళి పండగ వెలుగులు శివరాత్రి జాగారాలు… జాతరలు.. ఆటలు పాటలు.. చిన్నతనం చాలా తొందరగా గడిచిపోయింది. ఊరంతా ఒక కుటుంబం లాగా ఉండే “ఆ పాత మధురాలు
తిరిగి రాని రోజులు
మరిచి పోలేని గ్యాపకాల పరంపరలు. “
నన్ను కన్న నా తల్లికి
నన్ను పెంచిన నా మాతృభూమికి శిరస్సు వంచి పాదాభి వందనాలు చేస్తున్నాను.
సెలవు.
అలా మళ్ళీ నేను కాఫీ తాగుతూ నా లోకం లోకి వచ్చేసాను చెమర్చిన కళ్ళతో… 😢
By
Sravya 🍃