🥀🌹భద్రాచలంలో శ్రీ రాముడి కల్యాణం🌹🥀

భద్రాచలంలో రాముడి కల్యాణం అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు.
అభిజిర్లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం…
ఇది దోషరహిత ముహూర్త సమయం….
దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు.
అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక!

శ్రీరామనవమి అంటే రాముడి పెండ్లి రోజే కాదు.
అది ఆయన పుట్టినరోజు కూడా.
చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం.

మరి పుట్టిన రోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం..

శ్రీరాముడి పుట్టిన రోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు?

నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూల కారకుడు, ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త, సృష్టికర్త మన భక్త రామదాసు..

ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలంలో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం.

రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్త రామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు.

అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు. భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి.(శ్రీరంగంలో మాదిరిగా).

పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహితలో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు.
అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు, దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన
*“ఎస్య అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్”* (పరమ పురుష సంహిత) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం.

రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి. అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.
ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు, రూపకర్త, ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

వాల్మీకి రామాయణంలో కానీ, పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పబడ లేదు. కానీ, నాడు భద్రాచలంలో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై, చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి….

ఆ ముహూర్తనిర్ణయ స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా, ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.🙏

రచయిత: సాహితి

నా గురించి చెప్పాలంటే పుట్టింది పెరిగింది అంతా నా తెలుగు రాష్ట్రం లోనే. పల్లెటూర్లో చక్కటి పూబంతులతో అమ్మ వడిలో ఆడుకుంటూ పచ్చటి తోరణాలు నడుమ గారాభంగా పెరిగిన మా నాన్న ముద్దుల కూతుర్ని.. నా తెలుగు అంటే నాకు చాలా ప్రేమ. భాష మీద ఉన్న ప్రేమతో ఈ బ్లాగ్ ని ఆరంభిస్తున్నాను. మీ ప్రోత్సాహం తో ఇంకా ముందుకు నడవగలనని ఆశిస్తూ ....

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి