కథ మూలం : మహిళా గౌరవం

ఉదయం 6.15..

అలారమ్ మోగుతుంది.. దాన్ని ఆపేలోపు ఎవరో తలుపు కొడుతున్న  శబ్దం… తెరిచి చూస్తే ఎదురుగా గుడ్ మార్నింగ్ చెప్తూ చేతిలో వేడి వేడి కాఫీ  నా  కోసం ఎదురు చూస్తుంది… 

చిరునవ్వు తో కాఫీ అందుకుని తాగుతూ న్యూస్ పేపర్ లో హెడ్ లైన్స్ తిరగేస్తుంటే … 

ఇంతలో ఇంట్లో ఒక మూల నుంచి.. ” స్నానానికి వేడి నీళ్లు రెడీ …త్వరగా చేసి వస్తే …వేడి వేడి టిఫిన్ చేదువుగాని” అని వినిపించింది ….

టైం 8 .30 …ఆఫీస్ కి వెళ్ళొస్తా అని చెప్పి బయటకి వచ్చేలోగా… రోజు అదే టైం కి కాలేజీ కి వెళ్లే ఎదురింటి అబ్బాయి చాలా మర్యాదగా..  రండి మేడం మిమల్ని బస్టాప్ దగ్గర డ్రాప్ చేస్తా అంటే… మొహమాటంతో అబాయి బైక్ ఎక్కి సీట్ మీద దూరంగా ఇబ్బందిగా  కూర్చోవడం గమనించి.. ఆ అబ్బాయి అంతే హుందాగా ఇబ్బంది లేకుండా బైక్  నడుపుతూ  బస్టాపు లో  దించిన  10 నిమిషాలకి కి బస్సు వచ్చింది  …

అప్పటివరకు గుంపుగా  ఉన్న జనం ఒక్క సారిగా క్యూ  గా ఏర్పడి బస్సు ఎక్కారు … బస్సు లో ఇబంది  పడుతూ నిల్చోవడం చూసి సీట్ ఆఫర్ చేసిన 40 ఏళ్ళ అంకుల్ కి థాంక్యూ అని కళ్ల తోనే చెప్పి… నాకిష్టమైన  లైట్  మ్యూజిక్ వింటూ బస్ లో ఆఫీస్ కి  చేరుకున్నాను ……

అక్కడ  ఉన్న కొలీగ్స్ అందరు వినయంగా విష్ చేసినప్పుడు.. చిరునవ్వుతో రోజు ప్రారంభించిన కాసేపటికి.. 

బాస్ నుంచి తన కేబిన్ లోకి రమ్మని కాల్ వస్తే…. నేను కంప్లీట్ చెయ్యాల్సిన అసైన్మెంట్ కోసం  మందలించడానికి అయ్యుంటాది అని బిక్కు బిక్కు మంటూ లోపలికి వెళ్తే …. 

బాస్ చాల మర్యాదగా నేను చెప్పిన ప్రాబ్లెమ్ ని అర్ధం చేసుకుని ఏమి అనకుండా తనకి ఇంకాస్త టైం ఇస్తూ.. ఎక్స్ట్రా  అవర్స్ ఏమి పనిచెయ్యక్కర్లేదు అని సావధానంగా చెప్పినప్పుడు ….

అదే మోటివేషన్ తో చిరునవ్వుతో నేను  వర్క్ కంప్లీట్  చేసుకుని… సాయంత్రం ఇంటికి బయలుదేరితే ..

ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా  టీ నా కోసం ఎదురుచూస్తుంటే…. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వంట చేద్దామని కిచెన్ లోకి వస్తుంటే …. లోపలి నుంచి …వంట ఆల్రెడీ చేసేసాను అని సమాధానంచెప్పినప్పుడు….మనసారా థాంక్యూ చెప్పి రిలాక్స్డ్ గ కూర్చుని టీవీ చూస్తూ…..కబుర్లు  చెప్పుకుంటూ హ్యాపీగా భోజనం చేసి …నేను నా గది లోకి వెళ్లి  ప్రశాంతంగా నిద్రపోయాను  ……

ఉదయం 6.15  అలారమ్ మోగుతుంది …

ఇంతలో ఎవరో గట్టిగ  తలుపు కొడుతున్న శబ్దం ….

“ఏమే కాఫీ పెట్టి చావు” అని విసుగ్గా ఒక పిలుపు వినిపిస్తుంది ….

తను ఇప్పటి వరకు కన్నా ఈ కల లో ఇంకాసేపు మేలువుకువగ ఉంటే బాగుణ్ణు  అని  చాల ప్రయత్నించి …

ఏదో ఒక రోజు తన జీవితం లో ఈ కల నిజం అయ్యేలా చూడు అని తన ఇష్టదైవాన్ని తలుచుకుని కళ్ళు తెరుస్తుంది …….

ముగింపు ……..

రచయిత: సాహితి

నా గురించి చెప్పాలంటే పుట్టింది పెరిగింది అంతా నా తెలుగు రాష్ట్రం లోనే. పల్లెటూర్లో చక్కటి పూబంతులతో అమ్మ వడిలో ఆడుకుంటూ పచ్చటి తోరణాలు నడుమ గారాభంగా పెరిగిన మా నాన్న ముద్దుల కూతుర్ని.. నా తెలుగు అంటే నాకు చాలా ప్రేమ. భాష మీద ఉన్న ప్రేమతో ఈ బ్లాగ్ ని ఆరంభిస్తున్నాను. మీ ప్రోత్సాహం తో ఇంకా ముందుకు నడవగలనని ఆశిస్తూ ....

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి