Patience

సహనం.💐💐
అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో,
తెల్లటి పూలతో అందంగా ఉండేది..
దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది..
ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న
ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే
ఆశ కలిగేది.

అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి..
ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి.
చెట్టు బోసిపోయింది..
అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు.
ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు.

అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు.
తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా!
అనే నమ్మకంతో బతుకుతుంది.

కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది. అంతే చెట్టులో చలనం మొదలైంది..
కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి… కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి ,
పువ్వులు వికసించాయి..
మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది…
ఆ చెట్టు…!

మనిషి జీవితము అంతే…
ఒక్కొక్కసారి కొన్ని ‘అనర్ధాల’ వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..
కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు…

అయిన సరే నిరుత్సాహ పడకూడదు..
ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..

ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు
నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది
అని గట్టిగా నమ్ము…
అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..

గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి.
కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..

ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా
పూర్తి కావు.. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి,
సహనానికి ఆశ్రయం ఇవ్వు… బద్ధకానికి కాదు.
గుర్తుంచుకో.

నువ్వు త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు
ముందుగా ఉదయించడు.,
దానికి సమయం రావాలి..మనకు సహనం ఉండాలి…!!

రచయిత: సాహితి

నా గురించి చెప్పాలంటే పుట్టింది పెరిగింది అంతా నా తెలుగు రాష్ట్రం లోనే. పల్లెటూర్లో చక్కటి పూబంతులతో అమ్మ వడిలో ఆడుకుంటూ పచ్చటి తోరణాలు నడుమ గారాభంగా పెరిగిన మా నాన్న ముద్దుల కూతుర్ని.. నా తెలుగు అంటే నాకు చాలా ప్రేమ. భాష మీద ఉన్న ప్రేమతో ఈ బ్లాగ్ ని ఆరంభిస్తున్నాను. మీ ప్రోత్సాహం తో ఇంకా ముందుకు నడవగలనని ఆశిస్తూ ....

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి