Varalakshmi devi song

వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమమ్మాపరమపావనివమ్మా బంగారుబొమ్మా 1.క్షీరాబ్ది తనయ సింహాసన మిత్తుకోరి ధ్యానము చేసి దేవి పూజింతు 2.మల్లెపూవులు నీకు మగువలు తెచ్చితెల్లకల్వల తోను దేవి పూజింతు 3.పసుపు కుంకుమలోతో దేవి నిన్ను అర్చిం తుమిసిమి పండ్ల తోను తాంబూల మిత్తు 4.తొమ్మిది సూత్రముల తోరము గట్టుకొనితొమ్మిది జ్యోతుల తోను హారతి నిత్తు 5.మెండుగా పూర్ణాల వాయన మిత్తునిండుగా దీవించి కాపాడవమ్మా 6.శుక్రవారపు లక్ష్మీ శుభములీయమ్మఇక్కడ ఎవరి గోత్రం వాళ్ళు పాడాలి వారి స్తోత్రము వినుమమ్మ అమ్మ వారి“Varalakshmi devi song”ని చదవడం కొనసాగించండి

తొందరపాటు

బేటా! మీ డాడీ కోర్టు కి వెళ్ళాడా?రజియా బేగంషహనాజ్ ని అడిగింది.లేదు నానీ!ఇవాళ కేసులేం లేవట! తర్వాత నానీ ఏమంటుందో,తన తండ్రిని ఎలా కిందికి దించేస్తుందో పదహారేళ్ళ షహనాజ్ కి అనుభవమే!తన తమ్ముడు ఖయ్యూమ్ కి అయిదేళ్లు!వాడికి నానీ చేసే ముద్దే తెలుస్తుంది గానీ ఆవిడ సూటీ పోటీ మాటలు అర్థం కావు.అమ్మీ కి కూడా అబ్బా జాన్ ని అంటుంటే ఇష్టమో అయిష్టమో తెలియదు.బైటికి మాత్రం తల్లిని ఏమీ అనదు.షహనాజ్ కి మాత్రం తండ్రిని ఎవరేమన్నా“తొందరపాటు”ని చదవడం కొనసాగించండి

కథ

అది ఒక భయంకరమైన రాత్రి!అర్ధ రాత్రి దాటి,మూడో ఝాము లోప్రవేశిస్తోంది. వెంకటా పురం లోని ఇరుకు సందులలోవెలసిన వందల సంఖ్యలో ని చిన్న చిన్న ఇళ్ళల్లో ఒక చిన్న పోర్షన్! ఆ రెండు గదుల ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న మల్లేష్ ఊపిరి సలపనట్లయి,ఉలిక్కి పడి లేచాడు.పక్కన పడుకున్న లక్ష్మి ది అదే పరిస్థితి.లేచి కూర్చుని,ఒకటే ఆయాసపడుతోంది.ముందు వరండాలో అరవై ఆరేళ్ళ వరమ్మ స్పృహ లో లేదు.గబ గబా లేచిన మల్లేష్ జేబులో ఉన్న రుమాలు తీసి,ముక్కుకి“కథ”ని చదవడం కొనసాగించండి

బ్యాంక్ మేనేజర్ జన జీవన స్రవంతి లోకి …

రాత్రి ఎనిమిది గంటల వేళ వరంగల్ జిల్లా (అప్పటిలో}రాజు పేట ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజర్ అయన అనుచరుడు వరంగల్ నించి వస్తున్నారు.మోటార్ సైకిల్ మీద,వారివద్ద బ్యాంకు కోసం తెస్తున్న కాష్ అయిదు లక్షలు ఉన్నది. అసలు మోటార్ సైకిల్ మీద కాష్ తేవటం నిబంధనలకు పూర్తి విరుద్ధం.కానీ ఎవరు పట్టించుకొంటారు. గన్ మేన్స్ పెట్టి అంతదూరం { అంటే నూట అరవై కిలోమీటర్స్} వరంగల్ నుంచి రాజు పేట బ్రాంచ్ కి పంపటం అయ్యే పని“బ్యాంక్ మేనేజర్ జన జీవన స్రవంతి లోకి …”ని చదవడం కొనసాగించండి

వదిలిపెట్టవా ఇకనైనా!

అసలే పిల్లలు తక్కువైన దేశంవెల వెల బోతున్న ఆట స్థలంవృధ్దులకేది బయట విరామంఎలాగూ ఉండదు ఇంట్లో సుఖంపాలు తాగనీయకుండా దూడ కి చిక్కంకరోనా ని రానీయకుండా మనుషులకి మాస్క్నెలలు గడుస్తున్నా అణగ లేదు రోగంకోట్లు ఖర్చయినా దొరకలేదు బైట పడే మార్గంకరోనా! ఓ కరోనా!! వదిలిపెట్టవా ఇకనైనా!!! ~ లలిత రాయప్రోలు

యోగిక్ వే అఫ్ లివింగ్

మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో నిక్షిప్తమైన ఎంతో అమూల్యమైన విజ్ఞానం దానిలో కొంచెమైనా మన ముందుకు తీసుకు రావాలనే మా ఈ ప్రయత్నం. ఆరోగ్యమే మహా భాగ్యం యోగిక్ వే అఫ్ లివింగ్ అంటే మన జీవితం మొత్తం మార్చుకోవాలని కాదు. నిత్యం సాగించే మన జీవన సరళిలో స్వల్పంగా మార్పులు తెచ్చుకోవటమే.

అమ్మ

అమ్మా… అందరూ ఈరోజు వాళ్ళ అమ్మ ఫోటోలు షేర్ చేసి,వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు… మదర్స్ డే అట… తెగ పబ్లిసిటి ఇస్తున్నారు… నన్ను కూడా నీ గురించి ఏమైనా రాయమని ఫ్రెండ్ ఛాలెంజ్ పంపింది… కానీ ఏం రాయాలో తెలియట్లేదు… ఎందుకంటే… నాకు నువ్వు ఎందుకు ఇష్టమో, ఎంత ఇష్టమో… అసలు ఇష్టమో కాదో తెలియడం లేదు… చాలా కన్ఫ్యూజన్ గా ఉంది… నాకు ఊహ తెలిసే టైం కి నాకిష్టం“అమ్మ”ని చదవడం కొనసాగించండి

కరోనా పిశాచి

కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా మానవాళిని చంపి మురిసిపోతున్నావానాగరికతను చంపి నెగ్గాననుకుంటున్నావా కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా రాకాసి ఆనందం తాండవిస్తుందినీలోరాక్షసులను చంపిన చరిత్ర ఉన్నదీ మాలో కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా కరోనా నీవల్ల విలువలెన్నో తెలిసాయిసంస్కృతి సంప్రదాయం గుర్తుకొస్తుంది మాకు కరోనా కరోనా కరుణన్నదే లేదా నీకుదుష్టశక్తులతో కలసి దూసుకొస్తున్నావా కష్టాలు కన్నీళ్లు కొత్తేమి కాదు మాకుకలిసి కట్టుగ నిన్ను ఎదురుకొంటాం“కరోనా పిశాచి”ని చదవడం కొనసాగించండి

అందరికీ ఉగాది శుభాకాంక్షలతో..సరదాగా చిన్న కధ

అమావాస్య.. అర్ధరాత్రి.. వెంకటేశ్వరరావు అనుమానంగా చూస్తున్నాడు. నుదుట చెమటలు పడుతున్నాయి. వెన్నులో వణుకు మొదలైంది. నోరు పెగలడం లేదు. పైనుండి వేలాడుతున్న బల్బుకు కూడా భయం వేసినట్లుంది.. వెలిగుతూ ఆరుతూ ఉంది. వరండాలో తెల్లని జుబ్బాలో బిగ్గరగా నవ్వుతున్న మయేష్ వంక తలుపు చాటునుండి అలాగే చూస్తూ స్థంభించిపోయాడు వెంకటేశ్వరరావు. మయేష్ తన ముందు వాటా గదిలోకి అద్దెకు దిగి నెల రోజులు కావస్తోంది. ఆ గదికి కిటికీ కూడా లేక సరైన గాలి వెలుతురు ఉండకపోవడంతో“అందరికీ ఉగాది శుభాకాంక్షలతో..సరదాగా చిన్న కధ”ని చదవడం కొనసాగించండి

మేలిమి వజ్రం

సాయం సంధ్యా సమయం. నీరెండలో అలా వాకింగ్ చేసొద్దామని రోజూలాగానే పార్కుకి బయలుదేరాను. ప్రతీరోజూ నా కంటే ముందే పార్కుకి వచ్చి గేటు దగ్గర నా కోసం ఎదురుచూసే నా మిత్రుడు శ్రీనివాస్ కనపడలేదు. కాసేపు వేచి చూసి , “వచ్చాకా వాడే ఫోను చేస్తాడులే” అనుకుంటూ లోపలకి వెళ్ళి, పరిసరాలని గమనించడం మొదలుపెట్టాను. సగం మంది స్క్రీన్లలో తల దూర్చేసి బిజీగా ఉన్నారు, జీవన సంధ్యలో ఉన్న కొంత మంది పెద్దవాళ్ళు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ“మేలిమి వజ్రం”ని చదవడం కొనసాగించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి